Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalalai Poyenu

👤 Swarnalatha 🎼 Sakhi (Original Motion Picture Soundtrack) ⏱️ 5:59
🎵 2518 characters
⏱️ 5:59 duration
🆔 ID: 1013207

📜 Lyrics

ప్రేమలే నేరమా ప్రియా! ప్రియా!
వలపు విరహమా ఓ నా ప్రియా!
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
మదినే అతిథిగా రానేలనో
సెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకు నిదరేది
ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో
నా పిలుపే అందని దూరాలలో

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

అనురాగానికి స్వరమేది
సాగర ఘోషకు పెదవేది
అనురాగానికి స్వరమేది
సాగర ఘోషకు పెదవేది
ఎవరికి వారే ఎదురుపడి
యదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి
నిను చేరగ నేనే శిలనైతిని
ఎండమావిలో నావనులే ఈ నిట్టూర్పే నా తెరచాపలే

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి
వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి
చేసిన బాసలు కలలైపోతే
బతుకే మాయగ మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై
నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings