Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Thaane Maarenaa

👤 Raavu Balasaraswathi 🎼 Devadasu ⏱️ 3:58
🎵 2100 characters
⏱️ 3:58 duration
🆔 ID: 11855454

📜 Lyrics

తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారె
తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారె నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా
తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా

వలపు తీరు ఈ తీరౌనా ఆ
వలపు తీరు ఈ తీరౌనా మా చెలిమి కలలో పెన్నిదేనా ఆ ఆఆ
పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ
పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ
మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా
ఏరి కోరు ఉన్నదారు ఈ తీరాయెనా

నా సేవలకు ఇంతే వరమా ఆ
నా సేవలకు ఇంతే వరమా ఆ నాకిదే కడసారి దరిశనమా ఆ ఆ ఆ
అడియాస పాలు చేసినారు కోరినవారు
అడియాస పాలు చేసినారు కోరినవారు మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే
గాలీ మేడ కూలీపోయి ఈ తీరాయెనా
తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా

సాహిత్యం: సముద్రాల సీనియర్

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings