Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Poovullo Daagunna (From "Jeans")

👤 Unni Krishnan 🎼 Creative Director Shankar ⏱️ 6:55
🎵 4152 characters
⏱️ 6:55 duration
🆔 ID: 11969731

📜 Lyrics

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం

ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళన్ట నడిచొచ్చె నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లడే పువ్వా నువు ఎనిమిదొవ అతిశయమూ
నింగి లాంటి నీ కాళ్ళూ పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరు అధరాలు అతిశయమూ
మగువా చేతి వేళ్ళు అతిశయమే
మకుటాల్లాన్టి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం
ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings