Raasaanilaa (From "Bhala Thandhanana")
🎵 2210 characters
⏱️ 4:51 duration
🆔 ID: 1832740
📜 Lyrics
రాశానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖా
చూశానిలా కదలననే వదలననే మౌనరేఖా
రాశానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖా
నింగిలోని నీరులా నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాశానిలా
మీటలేని వీణలా మాటరాని పాపలా
అందమైన మౌనరేఖా చూశానిలా
పుస్తకంలో దాచుకున్నా నెమలికన్ను జ్ఞాపకంలా
మనసు దాటలేనీ మొదటి కవితలా
అల్లుకున్న పంజరానే తెలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా
తనని నాతొ కలుపగలిగె పిలుపు ఏదొ తెలియకా
తెలుపలేక నిలుపలేక అలసిపోయా నికా
దాచానిలా నిజమిదనీ ఋజువిదనీ చూపలేకా
చేరానిలా ఇరువురిదీ ఒకటి అనే తీరరేఖా
నడియెడారి దారిలో మౌన బాటసారిలా
వొంటరల్లె సాగానే నాకు నేనే
ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే
వెన్నెలల్లె కాచావే నీవు నన్నే
కలిసి ఉన్న వేళలోనా వీలుకాని మాటలన్నీ
మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా
తెగిన గాయం తగదు అన్న ఆగిపోదే మన కథా
చివరి క్షణమే మధురకావ్యం ప్రేమకెపుడూ కదా
చూశానిలా కదలననే వదలననే మౌనరేఖా
రాశానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖా
నింగిలోని నీరులా నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాశానిలా
మీటలేని వీణలా మాటరాని పాపలా
అందమైన మౌనరేఖా చూశానిలా
పుస్తకంలో దాచుకున్నా నెమలికన్ను జ్ఞాపకంలా
మనసు దాటలేనీ మొదటి కవితలా
అల్లుకున్న పంజరానే తెలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా
తనని నాతొ కలుపగలిగె పిలుపు ఏదొ తెలియకా
తెలుపలేక నిలుపలేక అలసిపోయా నికా
దాచానిలా నిజమిదనీ ఋజువిదనీ చూపలేకా
చేరానిలా ఇరువురిదీ ఒకటి అనే తీరరేఖా
నడియెడారి దారిలో మౌన బాటసారిలా
వొంటరల్లె సాగానే నాకు నేనే
ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే
వెన్నెలల్లె కాచావే నీవు నన్నే
కలిసి ఉన్న వేళలోనా వీలుకాని మాటలన్నీ
మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా
తెగిన గాయం తగదు అన్న ఆగిపోదే మన కథా
చివరి క్షణమే మధురకావ్యం ప్రేమకెపుడూ కదా