Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Veera Raja Veera

👤 A.R. Rahman feat. Shankar Mahadevan & Chinmayi 🎼 PS-2 (Telugu) [Original Motion Picture Soundtrack] ⏱️ 5:04
🎵 3739 characters
⏱️ 5:04 duration
🆔 ID: 1949971

📜 Lyrics

కళ్ళార చూద్దాం
చోళ ఖడ్గ సంచారం సంహారం
ఓ సొగసరి పూవా
పూమాలే... శుభమని వేయవే

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార. ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా. శిఖరం స్పృశించైర

మార రాకుమారా
చోరా చిత్త చోర
రా రా ఏలుకోర
కరవాల మీవేళ కనులెర్రజెయ్యంగ
భుజబలము ఈవేళ భూతలము మోయంగ

ధైర్యము మోహరింప
రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ...
తేజ సూర్య తేజ
వీర రాజా వీర శూర ధీర శూరా

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ,నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ
నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

సుడిగాడ్పులా అడుగేయరా
సర సర సర సర
శరమే తనువే తాకగా
చర చర చర చర
చెలరేగాలి వేగంగా

మగసిరి కండచూసి
కడలికి చెమట పోయు
పదునగు కత్తి చూసి
నింగికి నిదుర రాదు

రగతము పొంగి పారీ
నదులకు రంగు మారు
తెగిపడు తలలు అన్ని
అలలకు అన్నమౌను

పులివలె దూకుతుంటే
జగములు జింకలౌను
నిన్నిక పొగడమంటే
భాషకు స్వాస ఆగు

విధిగా తెగించైర
విధినే వదించైర
విలయం దరించైర
విజయం వరించైర

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార... ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా... శిఖరం స్పృశించైర

మార రాకుమారా... చోరా చిత్త చోర
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ... తేజ సూర్య తేజ
వీర రాజా వీర వీర రాజా వీర
శూర ధీర శూరా వీరా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings