Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Em Sandeham Ledu

👤 Kalyani Koduri 🎼 Oohalu Gusagusalade (Original Motion Picture Soundtrack) ⏱️ 3:53
🎵 2648 characters
⏱️ 3:53 duration
🆔 ID: 3154487

📜 Lyrics

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోందే
హృదయము రాసుకున్న లేఖా
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుంది చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వేగుర్తొస్తుంటే
నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నాగాని ఏమైనా అయిపోని ఏం ఫర్వాలేదన్నావా
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమత మైన గుండె గనుక
అడిగినదానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings