Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Alloneredu Kalla

👤 Mani Sharma, K. S. Chithra, Parthasarathy 🎼 Seenu ⏱️ 4:37
🎵 2791 characters
⏱️ 4:37 duration
🆔 ID: 6021296

📜 Lyrics

అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

దాయీ దాయీ అనగానే చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని కంటిపాప ఇంటిలోన ఏరికోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings