Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ne Ninnu Chera

👤 Ranjith, Veena Ghantasala 🎼 Andala Rakshasi ⏱️ 3:29
🎵 2219 characters
⏱️ 3:29 duration
🆔 ID: 6616992

📜 Lyrics

నే నిన్ను చేరవచ్చేలా
ఏదేదో చేసి
ఏదేదో చేసి
మరీచుడా

కాలికిందే నింగి ఉందే
తలకి తగిలే తారలే
చందమామే చేతికందే, కందే మోమే

నా నరనరాలలో నేరుగా నువ్వరానివై చేరగా
నమ్మనంత మారాను నీవుగా
హే' తరతరాలకీ తరగని ఓ నిధిలే నీ సన్నిధి
నాది నీది తేడాలే లేనిది

జంటగ మనమే ఒంటరితనమును ఇంటికి పంపేలా
నేలకే చెమటొచ్చేలా పాదాలు కదపాలిలా

నాలో నేనే లేనేలేనా నేను నీలా తేలానా
మరింతగా మారేంతగా ఈ రోజే జన్మంతగా
నీలాగా నే నన్ను నేనే వీడి నీలో చేరానా
అణువణువున తలపునవనా

తగువులెన్నున్నా తెల్లారిపోయే
తెగువ చన్నీల్లే చల్లేసెలే
తెలుపు నలుపేమో అల్లాడిపోయే
ముసుగు తన్నేసి తల్లాడెలే

ఎన్ని రంగులో మింగిన వర్షమే
మనసును తడిపెనులే
దూరమే దూరమై నేరుగా
సింధూరమై తాకే

తొలి తొలి నీ రాక (driving crazy my love)
తొలిగెనా ఇన్నాళ్ళ అలక
తొలిచిన బరువిక
తరిగే దారేగా కలయిక

రాలి జాలువారే ధారల్లే వరాలే
చేతిలో గీతైనది జవరాలే

ఎపుడూ నా జాడచూసి నిందలేసే నీ నీడే
నీ తోడుగా నేనుండగా విడువను కడదాక

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings