Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Edho Manasu

👤 Koti, K. S. Chithra, Mano, S.P. Sailaja 🎼 Amma Donga ⏱️ 4:34
🎵 2956 characters
⏱️ 4:34 duration
🆔 ID: 6840715

📜 Lyrics

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై
మనదై పోయే అనురాగాల ఫలమై

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

ఒక హృదయం పలికినది
జతకోరే జతులు శృతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోన చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
మెడవిరి గడుసరి సరి సరిలే

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వనికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి
విధి మరి విషమని మరి తెలిసే

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై
మనదై పోయే అనురాగాల ఫలమే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings