Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ede Naa Palletooru

👤 Vandemataram Srinivas, Usha 🎼 Bhadrachalam ⏱️ 4:59
🎵 1816 characters
⏱️ 4:59 duration
🆔 ID: 8341981

📜 Lyrics

ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... || ఇదే నా పల్లెటూరు ||

చరణం: 1
రామునికి బాణమొకటే భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు ఇంటింటా ఉంటే ఒకడు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జాయ్ జాయ్ జాయ్...
ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... || ఇదే నా పల్లెటూరు ||

చరణం: 2
తొలకరిలో వానచుక్క రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన చిన్ని గరిక నవ్వుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జాయ్ జాయ్ జాయ్...
ఆలమంద పాలధార మీటుతున్నదో సితార
కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... || ఇదే నా పల్లెటూరు ||

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings