Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Paapi Kondallo

👤 Sree Krishna, Geetha Madhuri 🎼 Fashion Designer s/o Ladies Tailor ⏱️ 3:30
🎵 2337 characters
⏱️ 3:30 duration
🆔 ID: 8566220

📜 Lyrics

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో

నువు టక్కరి దొంగవు కదా
గడసరి జోడీ నువు కదా
ఇక చెప్పకు తీయని సొద
పిలిచెను నేడే ప్రతిపొద
దోర దోర సొగసిదీ దొరకక దొరికిన పులసిదీ

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో

నీ వెనకే నీడలా
ఉన్నావయ్యా కొన్నాళ్ళుగా
నీ అడుగూ జాడలా
వచ్చావయ్యా కంగారు పడగా
నువు నవ్వితే హాయిగ నేనూ
నవ్వావయ్యా నవాబులా
నువు నవ్వని వేళల నేను
చూసానయ్యా దిగాలు పడగా
పిచ్చోడి లాగ తిరగనీ
వయసిక వరదగ ఉరకనీ

వాటముగా రా ఇక
వచ్చా వచ్చా వచ్చానులే
ఈ ఇసుకే వేదిక
ఇచ్చా ఇచ్చాను కానుకే
చలి గిచ్చిన వేళల లోన
అయ్యో గియ్యో అన్నానులే
నులి వెచ్చని కౌగిలి లోన
వయ్యారాన్నే వడ్డించి వేస్తిలే
పింఛాలు లేని నెమలినీ
మనసున సొగసుగ నమలనీ

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings