Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

[iSongs.info] 07 - Laali Laali

👤 Gopika Poornima 🎼 Damarukam - (2012) ⏱️ 4:50
🎵 2581 characters
⏱️ 4:50 duration
🆔 ID: 9054680

📜 Lyrics

(ఆరి రారి రారో తరి రారి రారి రారో
ఆరి రారి రారో తరి రారి రారి రారో)

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ
నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లీ
నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

(ఆరి రారి రారో తరి రారి రారి రారో
ఆరి రారి రారో ఆరారో
ఆరి రారి రారో తరి రారి రారి రారో
ఆరి రారి రారో ఆరారో)

బోసిపలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలీ
లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలీ
నీ చిన్ని పెదవంటితే పాల నదులెన్నో ఎదలోన పొంగి పొరలీ
నిను కన్న భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఈ ఆలీ

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

లాల నీకే నే పోసేటి వేళా అభిషేకంలా అనిపించేరా
ఉగ్గు నీకే నే కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉంది రా
సిరిమువ్వ కట్టే వేళా మాకు శివ పూజే గురుతొచ్చే మరల మరలా
కేరింత కొట్టే వేళా ఇల్లే కైలాసంలా మారే నీవల్ల

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings