Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aagipo Baalyama

👤 Ramya Behara 🎼 Mahanati ⏱️ 2:33
🎵 1833 characters
⏱️ 2:33 duration
🆔 ID: 9086823

📜 Lyrics

ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలౌదాం
ఏటిలో వేగమా, బాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం

ఇంతలో వెళిపోకుమా
వెంటవచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంటవచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకుమా

ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలౌదాం
ఏటిలో వేగమా, పాటలో రాగమా

ఊరికే పన్లేక తీరికస్సలులేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంతపొడుగెదిగాక తెలుసుకోలేరింక
సులువుగా ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా

నింగికి నిచ్చెన వెయ్యవే
నింగికి నిచ్చెన వెయ్యవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారం అల్లి రేపటి మెళ్ళో వెయ్యవే

నీ పిలుపే అంది నలువైపుల నుండి
అరచేతుల్లో వాలాలే నీ మది కోరిన కానుకలన్నీ

ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలౌదాం
ఏటిలో వేగమా, పాటలో రాగమా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings