Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nede Thelisindhi

👤 Mohammed Rafi 🎼 Aaradhana ⏱️ 5:06
🎵 2718 characters
⏱️ 5:06 duration
🆔 ID: 9228503

📜 Lyrics

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మనికళకే రూపంవస్తే
కమ్మనికళకే రూపంవస్తే
అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

ఓ... నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
తియ్యని పాటకు ప్రాణం వస్తే
తియ్యని పాటకు ప్రాణం వస్తే
అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
అది వలచేదొకసారేనని... ... ఆ వలపే విడిపోలేనిదని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
అది జతగా నను చేరాలని నా బ్రతుకే శృతి చేయాలని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మని కళకే రూపం వస్తే అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఓ... తియ్యని పాటకు ప్రాణం వస్తే అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings