Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Neetho Sayantram

👤 Koti, K. S. Chithra, S.P. Balasubrahmanyam, Sailaja 🎼 Amma Donga ⏱️ 4:20
🎵 3055 characters
⏱️ 4:20 duration
🆔 ID: 9497513

📜 Lyrics

సాహిత్యం: వేటూరి

నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయం వరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో... (2)

నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం

నీ జంట కోరే సాయంత్రము
నా ఒంటి పేరే సౌందర్యము
ఆ వేళ కొస్తే ఓ ఆమని కౌగిల్లకిచ్చా నా ప్రేమని
ఆ రాధ గోలేమో రాగం తీసే
ఈ రాస లీలేమో ప్రాణం తీసే
తగువే ఆనందం ఐనా పరువే గోవిందం
యమగుండం ఇతగాడే బతికుంటే జతగాడే
చలి చుక్కల గిలిగింతకు
పులకింతకు నిను పిలిచెలె

కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం

మేనత్త కొడుకా ఇది మేనక
మరుజన్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటే నీ ఊర్వశి
నీ కెందుకంట ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి
నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తార సఖితో సవాసం
మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దెల విందే
నిదరోయిన తొలి జన్మల సోదలిప్పుడు పొదలడిగెలే

నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయం వరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో...
హా హా హా హా... హా హా హా...

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings