Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Theta Theta Telugula

👤 Ghantasala, K. V. Mahadevan 🎼 Premanagar ⏱️ 3:32
🎵 2367 characters
⏱️ 3:32 duration
🆔 ID: 9897006

📜 Lyrics

తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
తేరులా
సెలయేరులా
కల కలా గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా
తెల్లవారి వెలుగులా
తేరులా
సెలయేరులా
కల కలా గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా ఆఅ
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా
జల జల గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవీ
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు
వెలసినవి వెలసినవి వెలసినవి
వీణలా నెరజాణలా
కల కల గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings